ETV Bharat / city

RGV Konda Movie: ఆంధ్రప్రదేశ్​లో 'తెలంగాణ రక్తచరిత్ర' షూటింగ్​..

సెన్సెేషనల్​ డైరెక్టర్​ రామ్​గోపాల్​వర్మ దర్శకత్వం వహిస్తున్న 'కొండా' సినిమా షూటింగ్​ ఏపీలో జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నట్లు వర్మ(rgv on konda movie shooting) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు వచ్చిన ఆర్జీవీ.. మరో రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభిస్తామన్నారు.

RGV
RGV
author img

By

Published : Oct 26, 2021, 10:48 PM IST

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న కొండా బయోపిక్(konda movie launch news) షూటింగ్.. ఏపీలో జరగనుంది. మరో రెండు రోజుల్లో ఈ షూటింగ్​ ప్రారంభం కానున్నట్టు డైరెక్టర్​ వర్మనే స్వయంగా తెలిపారు. షూటింగ్​లో భాగంగా.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు వచ్చిన వర్మ.. కొండా సినిమా (konda movie shooting at west Godavari district)​ గురించి పలు విశేషాలు పంచుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సినిమాకు సంబంధించిన కొంత భాగం తీయనున్నట్లు చెప్పారు. 15 రోజుల పాటు వివిధ లొకేషన్లలో సినిమా షూటింగ్ ఉంటుందన్నారు. అటవీ ప్రాంతంలోనూ షూటింగ్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే హనుమకొండ జిల్లాలోని వంచనగిలో ప్రారంభమైన షూటింగ్​.. వరగంల్​ పరిసర ప్రాంతాల్లో సాగుతోంది. ఇప్పుడు కొండా ఏపీకి రానున్నాడు.

తెలంగాణలో జరిగిన రక్తచరిత్రగా..

వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్ అయిన రామ్​గోపాల్ వర్మ(Ram Gopal Varma Latest News)... హారర్​, ఫ్యాక్షనిజం, రౌడీయిజం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్​గా నిలిచిన మాట అటుంచితే.. ఈ కథాంశాలతోనే వర్మ మరింత పాపులర్ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగే 'రక్త చరిత్ర' సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు తెలంగాణలో జరిగిన రక్తచరిత్రపై "కొండా" పేరుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి హనుమకొండలోని వంచనగరిలో కొండా బయోపిక్​ షూటింగ్​ను ప్రారంభించారు.

ఆడియోతో వైరల్​..

"విజయవాడలో చదవడం మూలాన నాకు అక్కడి రౌడీల గురించి తెలుసు. రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ మూలాన రాయలసీమ ఫ్యాక్షనిస్టుల గురించి తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాత్రం ఏమీ తెలియదు. కానీ, ఇటీవలే కొంతమంది మాజీ నక్సలైట్లు, అప్పటి పోలీసు అధికారులను కలిశాక మొదటిసారిగా ఈ సబ్జెక్ట్​పై అవగాహన వచ్చింది. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాకు సహకరించాలని కోరా." అంటూ వచ్చిన ఆర్జీవీ ఆడియో వైరల్​ అయింది.

ఎలాంటి వివాదాలు వస్తాయో..

కొండా సినిమా ప్రకటన సమయంలో కారల్ మార్క్స్​ను గుర్తుచేసుకున్న వర్మ.. 'విప్లవం ఎప్పటికీ ఆగదు.. కేవలం రూపు మార్చుకుంటుంది' అని చెప్పారు. కొండా సినిమా షూటింగ్ వరంగల్ పరిసరాల్లో ఉంటుందని తెలిపారు. ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తెరలేపుతుందో, తాననుకున్న సబ్జెక్ట్​ను అనుకున్నట్లుగా వర్మ తెరకెక్కించగలిగారా అన్నది షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తే గానీ తెలియదు.

ఇదీ చదవండి..: RGV: ఏపీ రాజకీయాలపై రామ్​ గోపాల్​వర్మ ట్వీట్‌... ఏమన్నారంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.