ప్రజల ఆరోగ్య సూచీల(Public Health Index)ను రూపొందించడంపై యుద్ధప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సూచీలను (ముఖచిత్రాలు-హెల్త్ ప్రొఫైల్స్) ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓ సాఫ్ట్‌వేర్(software)ను రూపొందించారు. దీని పనితీరుపై సోమవారం వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులు సమావేశమై చర్చించారు. ఈ సూచీల(Public Health Index) కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభించాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం విదితమే. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించడానికి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు త్వరలోనే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల(Telangana health ministry)తో భేటీ కానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ఎత్తు, బరువు, బీపీ, షుగర్ వంటివి ఇంటింటికి వెళ్లి పరీక్షించనుండగా.. ఈసీజీ(ECG) సహా కొన్ని రక్త, మూత్ర పరీక్షలను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వీటి సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలు సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చుతారు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తికి ఏకీకృత నంబర్ కేటాయిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ అంశాలన్నింటిపైనా వైద్యశాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు.
కేసీఆర్ కిట్ లబ్ధిదారులతో మాట్లాడనున్న మంత్రి హరీశ్‌రావు
కేసీఆర్ కిట్ పథకం(KCR KIT) కింద లబ్ధి పొందుతున్న గర్భిణులు(pregnant ladies), బాలింతలతో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Telangana health minister Harish Rao) టెలికాన్ఫరెన్సు ద్వారా సంభాషించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసుకున్న ఒక ఉమ్మడి జిల్లా పరిధిలో లబ్ధిదారులకు ముందే సమాచారం ఇస్తారు. మూణ్నాలుగు రోజుల్లోపే తొలి విడత టెలికాన్ఫరెన్సు ఉంటుందని వైద్యవర్గాలు తెలిపాయి.
నిర్దేశిత తేదీన గర్భిణులు, బాలింతలతో మంత్రి(Telangana health minister Harish Rao) మాట్లాడి.. సమస్యలను, పథకం అమలు తీరును తెలుసుకుంటారు. 102 వాహన సేవలు అందుతున్నాయా? కేసీఆర్ కిట్(KCR kit) ఇస్తున్నారా? బ్యాంకు ఖాతాలో డబ్బులు పడుతున్నాయా? పౌష్టికాహారాన్ని స్వీకరిస్తున్నారా? శిశువుకు టీకాలను సకాలంలో వేయిస్తున్నారా? తదితర అంశాలను మంత్రి(Telangana health minister Harish Rao) తెలుసుకుంటారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడడం ద్వారా తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
- ఇదీ చదవండి : 'స్టాటిన్లతో కొవిడ్ కారక మరణముప్పు దూరం'