ETV Bharat / city

మరికొన్ని గంటల్లో నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ47 - pslv c47 launch from sriharikota ap

మరికొద్ది గంటల్లో పీఎస్​ఎల్​వీ -సీ 47 నింగిలోకి దూసుకుపోనుంది. 1,625 కిలోల కార్టోశాట్​తో కలిపి మొత్తం 14 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి వాహకనౌక మోసుకుపోనుంది. ఈ ప్రయోగం కౌంట్​డౌన్ మంగళవారం నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది.

మరికొన్ని గంటల్లో నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ47
మరికొన్ని గంటల్లో నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ47
author img

By

Published : Nov 27, 2019, 5:47 AM IST

Updated : Nov 27, 2019, 7:48 AM IST

మరికొన్ని గంటల్లో నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ47

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో..... మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 9 గంటల 28 నిమిషాలకు కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను పీఎస్​ఎల్​వీ- సీ47 వాహకనౌక నింగిలోకి తీసుకెళ్లనుంది.

ఈ ప్రయోగానికి మంగళవారం ఉదయం 7 గంటల 28 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. మూడో తరానికి చెందిన హై రెజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంగా కార్టోశాట్‌-3ని రూపొందించారు. దీని జీవిత కాలం ఐదేళ్లు. కార్టోశాట్-3 బరువు సుమారు 1,6 వందల 25 కిలోలు. పట్టణ అభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి, తీరప్రాంత వినియోగంలో ఈ ఉపగ్రహం సేవలందించనుంది. వీటితో పాటు ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన ఫొటోలను మరింత జూమ్‌ చేసి తీసే వీలు కలుగుతుంది.

Intro:Body:

NOTE: FEED IN THIS FILE IS FILE SHOTS ONLY... IT IS NOT THE ORIGINAL FEED. IF WE RECIEVE ANY FROM SRIHARIKOTA, WILL SHARE IMMEDIATLY

ISRO countdown for PSLV C-47 has started this morning at 7.28 a.m.. 26 hours  this count down will continue. With PSLV -C57   ISRO is planning to launch 14 satellites at a time. PSLV -C 47  is going into space from satish dhawan space research centre (SHAH) in POTTI SRI RAMULU NELLORE DISTRICT. This is the first experiment since chandryan -2. Reharsals for this launch was completed by monday(25-11-2019). at 10 am. Later abard test was conducted.  If the weather conditions are favorable, the PSLV-C47 carrier is expected to launch at 9.28 am on Wednesday.  After 26.50 minutes, 14 satellites will be launched into their concerned orbits.  Our country's Kartosat-3 satellite will be introduced into a orbit that is 515 km away from earth. after 17.42 minutes. then follows american satelitte after kartosat-3.

                                       kartosat-3 satellite specialities

* Weight-1,625 kgs

*Life time - 5 years.

* kartosat-3   satellite is not only used for surveillance but also strenghtens country's army.

* The camera is capable of capturing images  better than 0.25 meters. a vey sophisticated version.

*Not only for the army needs but kartosat helps in natural calamities

* The satellite can be used in coasatal areas management, plannings in urban and rural areas,  Highway Network Examination, to study water supply 

* The satellite is estimated to cost over Rs 350 crore.

--

కొనసాగుతున్న పీఎస్‌ఎల్‌వీ-సి47 కౌంట్‌డౌన్‌భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి రోదసీలోకి ఒకేసారి 14 ఉపగ్రహాల్ని పంపేందుకు రంగం సిద్ధం చేసింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక ఇందుకు సిద్ధమైంది. చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగమిది. సోమవారం ఉదయం పది గంటలకు రిహార్సల్‌ను విజయవంతంగా ముగించారు. అనంతరం ఆబార్డ్‌ టెస్టు నిర్వహించారు. ఇవాళ ఉదయం 7.28 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.26 గంటలపాటు నిరంతరాయంగా కౌంట్‌డౌన్‌ కొనసాగుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే పీఎస్‌ఎల్‌వీ-సి47 వాహకనౌక బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. మన దేశానికి చెందిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని రాకెట్‌ బయలుదేరిన 17.42 నిమిషాలకు 515 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో వదులుతుంది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఉపగ్రహాల్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.కార్టోశాట్‌-3 ప్రత్యేకతలివీ...

కార్టోశాట్‌-3 ఉపగ్రహం బరువు 1,625 కిలోలు. జీవిత కాలం ఐదేళ్లు. ఈ ఉపగ్రహం నిఘాకు ఉపయోగపడుతూ దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయనుంది. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించింది. ఇందులోని కెమెరాకు 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్‌ చిత్రాల్ని తీసే సామర్థ్యముంది. సైనిక అవసరాలకే కాకుండా ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ కార్టోశాట్‌ సేవలందించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, తీరప్రాంత నిర్వహణ, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఉపగ్రహ తయారీకి రూ.350 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం.

Conclusion:
Last Updated : Nov 27, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.