ETV Bharat / city

"ప్రైవేట్‌ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత కల్పిస్తాం" - Harish Rao Update news

హైదరాబాద్​ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్​లో ప్రైవేటు రంగ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్​ రావు డైరీ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్‌ ఉద్యోగులు కీలకంగా పని చేశారని తెలిపారు. ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగులను వేధింపులకు గురి చేయవద్దని సూచించారు.

provide-job-security-to-private-employees
"ప్రైవేట్‌ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత కల్పిస్తాం"
author img

By

Published : Jan 2, 2020, 11:35 PM IST

ప్రైవేట్‌ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఈవిషయంలో ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. హైదరాబాద్​ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్​.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రైవేటు రంగ ఉద్యోగ సంఘాల డైరీని మంత్రి ఆవిష్కరించారు.

"ప్రైవేట్‌ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత కల్పిస్తాం"

ఉద్యోగులను వేధించకండి

తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్‌ ఉద్యోగులు కీలకంగా పని చేశారని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నాయని.. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతను ఉపాధి వైపు నడిపించాలని కోరారు. సమయం వృధా చేసుకోకుండా.. యువత ఉపాధి వైపు సాగాలని ఆకాక్షించారు. తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతలో కొంత వెనబడిందని.. నిరుద్యోగ యువత, ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు.. చిన్నారులకు విద్య నేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరాషేక్​ విడుదల... మళ్లీ అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.