ETV Bharat / city

ఖైరతాబాద్‌ గణపతి వద్ద భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నిరసన - bhagyanagar utsav samithi protest

protest at khairatabad ganesh by bhagyanagar utsav samithi
ఖైరతాబాద్‌ గణపతి మండపం వద్ద భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నిరసన
author img

By

Published : Aug 24, 2020, 11:34 AM IST

Updated : Aug 24, 2020, 1:12 PM IST

11:31 August 24

ఖైరతాబాద్‌ గణపతి వద్ద భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నిరసన

ఖైరతాబాద్‌ గణపతి మండపం వద్ద భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నిరసన

హైదరాబాద్​లోని ఖైరతాబాద్ గణపతి మండపం వద్ద భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి ఆందోళన చేపట్టింది. భక్తులను వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు డిమాండ్ చేశారు.  

  ఖైరతాబాద్ గణపతి మండపం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. హిందువుల పండుగలపై ప్రభుత్వ కక్షపూరిత చర్యలను సహించేది లేదని భగవంతరావు ధ్వజమెత్తారు. గవర్నర్ జోక్యం చేసుకుని.. గణేశ్​ నవరాత్రులు సజావుగా జరిగేలా చూడాలని కోరారు.  

ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉత్సవాలు నిర్వహిస్తున్నారని భగవంతరావు పేర్కొన్నారు. మండపాల దగ్గరకు వెళ్లే యువకులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేసులు పెడతామని భయపెడుతున్నారని భగవంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇవీచూడండి:   అమ్మకు ఎంత కష్టం.. ఆరు గంటలపాటు ఆస్పత్రులన్నీ తిరిగినా..

Last Updated : Aug 24, 2020, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.