ETV Bharat / city

స్వాతంత్య్ర దినోత్సవం వేళ 175 మంది ఖైదీలు విడుదల

క్షణికావేశం ఓ ఇంటి పెద్దను జీవిత ఖైదీని చేసింది. కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది. ఓ క్వార్టర్‌ మద్యం ఓ మాజీ సైనికుడిని 13 ఏళ్లు జైలు జీవితం అనుభవించేలా చేసింది. కోపంలో చేసిన ఓ చిన్న తప్పు ఓ మహిళను హంతకురాలిగా మార్చి తన పిల్లలకు దూరం చేసింది. ఇలా స్వాతంత్య్ర దినోత్సవం వేళ విడుదలైన 175 మంది ఖైదీల్లో ప్రతిఒక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.

Prisoners
Prisoners
author img

By

Published : Aug 16, 2022, 1:01 PM IST

75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన 175 మంది ఖైదీలకు శిక్ష నుంచి విముక్తి కలిగించింది. విశాఖ నుంచి 40 మంది, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 66 మంది ఖైదీలు, కడప జైలు నుంచి 31 మంది, నెల్లూరు కారాగారం నుంచి 25 మంది ఖైదీలను అధికారులు విడుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి విడుదలైన వారిలో 55 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళా ఖైదీలున్నారు. విశాఖ కారాగారం నుంచి 41 మంది విడుదల కాగా.. వారిలో 33 మంది జీవిత ఖైదీలే. క్షణికావేశంలో చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఈ క్షమాభిక్ష కల్పించిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి 24 మంది ఖైదీలను పోలీసులు విడుదల చేశారు. నెల్లూరు కారాగారానికి చెందిన ఓ ఖైదీ.. కేరళ జైల్లో ఉండటంతో అక్కడి నుంచే విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలు కోపంలో అనాలోచితంగా చేసిన పనికి తమ జీవితమే బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వార్టర్ మద్యం వల్ల.. 13ఏళ్ల జీవితం జైలు పాలైందన్న ఓ ఖైదీ మద్యం నిషేదించాలని కోరారు. ఇకపై సత్ప్రవర్తనతో మెరుగైన జీవనం సాగిస్తామన్నారు.

అపరాధ రుసుము చెల్లించలేక..: ఏపీలోని విశాఖ కేంద్ర కారాగారం నుంచి 40 మంది పురుషులు, ఇద్దరు మహిళల విడుదలకు అనుమతి లభించింది. వీరిలో హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఓ మహిళ రూ.60 వేల జరిమానా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కట్టకపోతే మరో ఆరు నెలలు అదనంగా జైలుశిక్ష అనుభవించాలని అప్పట్లో కోర్టు తీర్పునిచ్చింది. సత్ప్రవర్తన కారణంగా ఆమె విడుదలకు తాజాగా అవకాశం వచ్చినా, జరిమానా చెల్లించనందున బయటకు రాలేకపోయింది. దీంతో సోమవారం 41 మందే విడుదలయ్యారు.

స్వాతంత్య్ర దినోత్సవం వేళ 175 మంది ఖైదీలు విడుదల

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.