ETV Bharat / city

తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ

author img

By

Published : Nov 7, 2020, 10:58 AM IST

‘తపాలా పొదుపు ఖాతాలో సొమ్మును ఇక నుంచి ఏ బ్యాంకు ఖాతాకైనా బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌ వంటి పద్ధతుల్లో క్షణాల్లో వినియోగదారులు కోరిన ఖాతాకు జమచేసే సదుపాయం రాబోతుంది. ఈ మేరకు రిజర్వుబ్యాంకు అనుమతించింది. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తపాలాశాఖ అభివృద్ధి చేస్తోంది. జనవరి కల్లా ఈ సదుపాయం ఖాతాదారులకు అందుబాటులోకి వస్తుంది’’ - సీపీఎంజీ ఎస్‌.రాజేంద్రకుమార్‌

postal new inventions for customers in telangana
తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ
తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ

తపాలా ఖాతాదారుల్ని కాపాడుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించడానికి ఆధునిక సాంకేతికత సాయంతో వినూత్న సేవల్ని అందించేందుకు తమ శాఖ సిద్ధమవుతోందని తెలంగాణ తపాలా సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ (సీపీఎంజీ) ఎస్‌.రాజేంద్రకుమార్‌ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 50 శాతానికి పైగా ఆదాయం నష్టం వాటిల్లినప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయి సేవల్ని అందించామని చెప్పారు. వైరస్‌ బారిన పడి 12 మంది ఉద్యోగులు మరణించారన్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తమశాఖ ఆన్‌లైన్‌ సేవల్ని మరింత విస్తృతం చేయనుందని వివరించారు. తెలంగాణ సర్కిల్‌ సీపీఎంజీగా కొద్దిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన ‘ఈనాడు-ఈటీవీ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్ర: మారుతున్న పరిస్థితులు, సవాళ్లను తపాలాశాఖ ఎలా ఎదుర్కొంటోంది?

జ: తెలంగాణలో 4,967 బ్రాంచి పోస్టాఫీస్‌లున్నాయి. అన్నిరకాలూ కలిపి 1.26 కోట్ల ఖాతాలు ఉన్నాయి. కరోనా పోస్టల్‌ శాఖ ఆదాయంపై తీవ్రప్రభావం చూపింది. రికరింగ్‌, టర్మ్‌ వంటి కొత్త డిపాజిట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా గతేడాది పోస్టల్‌ ఆదాయం రూ.4,500 కోట్లు వస్తే ఈసారి 1,300 కోట్లు దాటే పరిస్థితిలేదు. తెలంగాణ సర్కిల్‌లో గతేడాది ఒక్క రూ.199 కోట్లు వస్తే ఈసారి ఆరునెలల్లో రూ.52 కోట్లే వచ్చింది. ఆదాయం పెంపునకు సంబంధించి కొత్త మార్గాలపై దృష్టి సారించాం.

ప్ర: కొత్తగా ఎలాంటి సేవలు తీసుకురానున్నారు?

జ: విదేశాలకు పార్శిల్‌ సేవల్ని గణనీయంగా పెంచడమే ప్రధాన లక్ష్యం. ‘పోస్టల్‌ ఛానల్‌’ పేరుతో నిబంధనల్ని సడలించాం. హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సదుపాయం ఉన్న అన్ని దేశాలకూ పార్శిళ్లు పంపే సౌకర్యాన్ని కొవిడ్‌ నిబంధనల సడలింపునకు అనుగుణంగా విస్తరిస్తాం. హైదరాబాద్‌ హుమయూన్‌నగర్‌లోని ‘ఫారిన్‌ పోస్టాఫీస్‌’కే పరిమితమైన సేవల్ని రాష్ట్రంలో అన్ని తపాలా కార్యాలయాలకు విస్తరించాం. దుస్తులు, మందులు తదితరాలను ఏ పోస్టాఫీస్‌ నుంచైనా విదేశాలకు పంపొచ్చు. ఉదాహరణకు నిర్మల్‌ బొమ్మలను విదేశాలకు పంపాలంటే హైదరాబాద్‌కు రానక్కర్లేదు. స్థానిక పోస్టాఫీస్‌కు వెళ్లి అవసరమైన పత్రాలపై సంతకం చేస్తే చాలు. వాటి తనిఖీ ప్రక్రియ హైదరాబాద్‌లో ఉంటుంది.

ప్ర: తపాలా బ్యాంకులతో నిలదొక్కుకున్నారా?

ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకుల్ని ప్రతి డివిజన్‌కు ఒకటి చొప్పున 15 ప్రారంభించాం. వీటి సంఖ్య పెంచే అవకాశం లేదు. అదేసమయంలో తెలంగాణలోని 4,967 బ్రాంచి పోస్టాఫీసుల్లో ఈ తపాలా బ్యాంకు సేవల్ని అనుసంధానించి విస్తరించాం. 24 గంటలూ స్పీడ్‌ పోస్ట్‌ అందించే పోస్టాఫీస్‌ల సంఖ్యనూ పెంచుతున్నాం.

ప్ర: నగరాలు, పట్టణాల్లో తపాలాశాఖ ఆస్తుల పరిస్థితి ఏంటి? ఉద్యోగుల కుదింపు ఉంటుందా?

జ: మా శాఖకు 150 చోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. వీటిని వాణిజ్య ఆదాయంగా మార్చే ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు. తపాలా సేవల ప్రాంఛైజీల్ని ప్రైవేటుకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులను మరిన్ని సేవలకు ఉపయోగించుకుంటున్నాం.

ప్ర: కొత్త వినియోగదారుల్ని ఆకర్షించడానికి ఏం చేయబోతున్నారు?

జ: లాకర్‌ సేవలపై దృష్టిపెట్టాం. పోస్టాఫీసుల్లో కాకుండా.. ఎవరైనా సౌకర్యాలు కల్పిస్తే బహుళ అంతస్తుల భవనాలు, అపార్టుమెంట్లలో ఈ సేవలను అందిస్తాం. బ్యాంకు లాకర్‌ మాదిరిగా కాకుండా డిజిటల్‌ రూపంలో తాళం ఉంటుంది. మెట్రోస్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ‘స్మార్ట్‌ పోస్ట్‌ కియోస్క్‌’లు తీసుకురాబోతున్నాం. రిజిస్టర్‌ పోస్టు, స్పీడ్‌పోస్టు సేవలు ఇక్కడ అందుతాయి. ఈసేవల చెల్లింపులు డిజిటల్‌ రూపంలో ఉంటాయి.

ప్ర: డిపాజిట్ల గడువు ముగిశాక డబ్బు తీసుకోవడానికి పొదుపు ఖాతా తప్పనిసరిగా తెరవాలా..?

జ: రూ.20 వేలకు పైగా వచ్చే సొమ్మును నగదు రూపంలో కాకుండా చెక్కు రూపంలో ఇస్తున్నాం. ఆ మొత్తాన్ని ఖాతాలో జమ చేసుకోవాలి. పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా తెరవాలన్నది తప్పనిసరి కాదు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు, 6 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.