ETV Bharat / city

పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం... తుప్పల్లో ఆధార్ కార్డులు.. ఇంకా..! - ముళ్లతుప్పల్లో ఆధార్ కార్డులు

Postal Staff Negligence: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోస్టల్ సిబ్బంది అలసత్వం బయటపడింది. ప్రజలకు చేరాల్సిన ఒరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు పత్రాలు.. వివిధ ప్రభుత్వ శాఖలకు చేరాల్సిన లేఖలు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. అయితే ఇవన్నీ రిజిస్టర్​​ పోస్టులో వచ్చినవే. వీటి పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ ఉత్తరాల పరిస్థితి ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం... తుప్పల్లో ఆధార్ కార్డులు.. ఇంకా..!

author img

By

Published : Jun 23, 2022, 7:06 PM IST

పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం... తుప్పల్లో ఆధార్ కార్డులు.. ఇంకా..!

ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోస్టల్ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించిన తీరు బట్టబయలైంది. ప్రజలకు చేరాల్సిన ఒరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు లేఖలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చేరాల్సిన లేఖలు బట్వాడా చేయకుండా.. తొర్రగుంటపాలెం ఆర్టీవో కార్యాలయం వెనుక ముళ్లతుప్పల్లో పడేశారు. వాటిల్లో లాయర్ నోటీసులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగులు వివిధ కోచింగ్ సెంటర్లు, బుక్ స్టాళ్ల నుంచి తెప్పించుకునే స్టడీ మెటీరియళ్లు, సుమారు రెండు వందల ఒరిజినల్ ఆధార్ కార్డులు ఉన్నాయి.

ఇవన్నీ రిజిస్టర్ పోస్ట్​కు సంబంధించినవిగా తెలిసింది. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి..

Universities staff: విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు.. ఉత్తర్వులు జారీ

గ్రాండ్​గా కుక్క బర్త్​డే పార్టీ.. 100కేజీల కేక్​ కటింగ్.. ఐదు వేల మందికి భోజనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.