ETV Bharat / city

పోలీసు కస్టడీలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర కేసు నిందితులు - మంత్రి హత్యకు కుట్ర కేసు

Murder Plan to Kill TRS Minister : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఏడుగురు నిందితుల కస్టడీకి మేడ్చల్ న్యాయస్థానం అనుమతిచ్చింది. నాలుగు రోజుల పాటు నిందితులను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Murder Plan to Kill TRS Minister
Murder Plan to Kill TRS Minister
author img

By

Published : Mar 9, 2022, 1:01 PM IST

Murder Plan to Kill TRS Minister : రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితుల కస్టడీకి మేడ్చల్ న్యాయస్థానం అనుమతిచ్చింది. చర్లపల్లి జైలులో ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌, అమరేంద్రరాజు, రాఘవేంద్రరాజు, మధుసూదన్‌రాజు, మున్నూర్‌ రవిని కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు వారిని విచారించనున్నట్లు తెలిపారు.

Police Custody for Accused in Minister Murder : నిందితుల్లో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ థాపాను పోలీసులు అరెస్టు చేయగా.. సొంత పూచీకత్తుపై బెయిల్‌పై విడుదలయ్యాడు. మిగిలిన ఏడుగురు నిందితుల నుంచి మంత్రి హత్య కుట్రకు సంబంధించిన కీలక వివరాలు రాబట్టేందుకు నిందితులను 4 రోజులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ సమయంలో నిందితులపై ఎటువంటి బలప్రయోగం(థర్డ్‌ డిగ్రీ) చేయకూడదని.. విచారణ ముందు, తరువాత వైద్యపరీక్షలు నిర్వహించాలని, నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించింది. ఇవాళ్టి నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు నిందితులను పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు రూ.15 కోట్లు ఎవరు సమకూర్చుతామన్నారు?.. ఆయుధాలు ఎక్కడ కొనుగోలు చేశారనే వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.

హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్‌

Murder Plan to Kill Minister Srinivas : ఎలాంటి ఆధారాలు లేకుండా హైదరాబాద్‌ పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌ థాపా తిలక్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్రకు సంబంధించి తనపై కేసును కొట్టివేయాలని, అందులో తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఒక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, నిందితులకు ఆశ్రయం కల్పించానంటూ పోలీసులు నిందితుడిగా చేర్చారన్నారు. చట్టప్రక్రియను వారు దుర్వినియోగం చేశారని, వ్యర్థ ఆరోపణలతో మహమ్మద్‌ ఫరూక్‌ అహ్మద్‌ ఫిర్యాదు చేశారన్నారు. మాజీ ఎంపీ వ్యక్తిగత సహాయకుడి అతిథులకు.. ఆయన ఆదేశాల మేరకు ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. తనను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా కారణాలు లేనందున జ్యుడిషియల్‌ రిమాండ్‌కు మేజిస్ట్రేట్‌ నిరాకరించారన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.