ETV Bharat / city

రాకేశ్ అంత్యక్రియలకు వెళ్తుండగా.. రేవంత్​రెడ్డి అరెస్టు! - రేవంత్​ని అరెస్టు చేసిన పోలీసులు

Revanth Reddy: రాకేశ్‌ చావును వాడుకుని... తెరాస శవరాజకీయాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్‌ సహా పలువురు కాంగ్రెస్​ నేతలను ఘట్‌కేసర్‌ టోల్‌గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Police arrested Revanth Reddy
Police arrested Revanth Reddy
author img

By

Published : Jun 18, 2022, 1:47 PM IST

Revanth Reddy: నిన్నటి సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ కాల్పుల ఘటనలో చనిపోయిన రాకేశ్​ కుటుంబాన్ని పరామర్శించడానికి బయల్దేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్‌ సహా పలువురు కార్యకర్తలని ఘట్‌కేసర్‌ టోల్‌గేట్ వద్ద అడ్డుకున్నారు. బలవంతంగా రేవంత్​ని వాహనంలోకి ఎక్కించి పీఎస్​కి తరలించారు. రాకేశ్‌ చావును వాడుకుని... తెరాస శవరాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేశ్‌కుటుంబం వద్దకు తెరాస నేతలు వెళ్తున్నారు... కాంగ్రెస్‌నాయకులు వెళ్తే తప్పేంటని? రేవంత్‌ ప్రశ్నించారు. తనను వరంగల్‌కు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని... మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.