మరోవైపు సాధారణ జనజీవనానికి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అన్ని ఆర్టీసీ డిపోలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే పోలీసులను మోహరించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేసే అవకాశముంది.
ఉదయం నుంచే నిరసనలు, ధర్నాలు
బంద్‌లో భాగంగా ఇవాళ యంజీబీఎస్ బస్ స్టేషన్ ముందు వామపక్షాలు ఉదయం 7 గంటలకు నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి. 11 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి భారీ ప్రదర్శన తలపెట్టనున్నాయి. జేబీఎస్‌తో పాటు ప్రధాన కూడళ్ల వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహాకరించాలని ఆచార్య కోదండరాం కోరారు.
అటు భాజపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని.. విజయవంతం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.