ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు ఆర్ఆండ్ఆర్, భూసేకరణ చట్టం-2013 ప్రకారం బాధితులందరికి సత్వరమే న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఈ వ్యాజ్యాన్ని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ దాఖలు చేశారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని పిటిషన్లో పేర్కొన్నారు. 2017-18 సవరించిన అంచనాల ప్రకారం అవసరమైన నిధులు సమకూర్చడానికి కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపినా... కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం తెలపాలని పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: సబ్సిడీ రుణాల దరఖాస్తు తేదీ పెంపు: మంత్రి కొప్పుల