ETV Bharat / city

Saidabad Rape case : సైదాబాద్​ రేప్ కేసు నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్ - pil in high court on saidabad rape case accused murder

సైదాబాద్​ రేప్ కేసు నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్

author img

By

Published : Sep 17, 2021, 10:46 AM IST

Updated : Sep 17, 2021, 2:23 PM IST

10:43 September 17

Saidabad Rape case : సైదాబాద్​ రేప్ కేసు నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు.  

చిన్నారిపై లైంగిక దాడి, హత్య జరిగిన కొన్ని గంటల్లోనే రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పిల్​లో పేర్కొన్నారు. చట్టప్రకారం కోర్టులో హాజరు పరచకుండా తమ కస్టడీలో ఉంచుకుని.. రాజును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. రాజు మృతిపై సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకన్న కోరారు. రాజు కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అత్యవసర పిల్​గా పరిగణించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం.. నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Last Updated : Sep 17, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.