ETV Bharat / city

రికార్డ్: కళ్లు మూసుకొని పియానో వాయించాడు - బాలుడికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్

వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్​ సాధించాడు 13 ఏళ్ల హరిహరన్. ఏకంగా 29 నిమిషాల 19 సెకన్ల పాటు కళ్లకు గంతలు కట్టుకొని పియానో వాయించాడు. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్​ రికార్డ్స్​ నుంచి మెడల్, ప్రశంసపత్రం అందుకున్నాడు.

piano  player hariharan wonder book of record
రికార్డ్: కళ్లు మూసుకొని పియానో వాయించాడు
author img

By

Published : Dec 30, 2020, 8:35 AM IST

కళ్లకు గంతలు కట్టుకొని 29 నిమిషాల 19 సెకన్లలో పియానోతో 20 పాటలు వాయించి... వండర్ బుక్​ ఆఫ్​ రికార్డ్​ సృష్టించాడు 13 ఏళ్ల హరిహరన్​ నాయుడు. ఈ మేరకు సికింద్రాబాద్ లయన్స్​ క్లబ్​లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మెడల్, సర్టిఫికేట్​ అందజేశారు. పిల్లలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప విజయాలు సాధిస్తారని ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్​ అన్నారు. తెలంగాణకు చెందిన బాలుడు ఈ రికార్డ్ సాధించడం గర్వంగా ఉందని... మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి అన్నారు. ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

కళ్లకు గంతలు కట్టుకొని ఈ రికార్డ్ సాధించడం ఇదే మొదటిసారి అని వండర్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ సౌత్​ చీఫ్​ ఇంఛార్జ్​స్వర్ణ శ్రీ గుర్రం అన్నారు. హరిహరన్ ఈ రికార్డ్​ సాధించేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రోత్సహించారు. చదువు ఒక్కటే కాకుండా వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప స్థాయికి చేరుకుంటారని హరిహరన్​ తల్లి అరుణ అన్నారు. హరహరన్​ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నట్టు తెలిపింది.

ఇదీ చూడండి: ఆకాశమంత పందిరిలో హద్దుల్లేని ఆనందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.