రాష్ట్రంలో ఫార్మసీ, బయోటెక్నాలజీ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. చివరి విడత కౌన్సెలింగ్లో కొత్తగా 1,731 సీట్లు కేటాయించారు. ఇందులో 392 మంది విద్యార్థులు కళాశాల, కోర్సులు మారారు.
కన్వీనర్ కోటాలో 6,848 బీఫార్మసీ, 1,126 ఫార్మా డీ, 21 బయోటెక్నాలజీ సీట్లు భర్తీ అయ్యాయి. ఈనెల 23లోగా ఆన్లైన్లో వ్యక్తిగత రిపోర్టింగ్ ద్వారా విద్యార్థులు కళాశాలల్లో చేరాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.