ETV Bharat / city

పీఈసెట్​లో ప్రతిభ చాటుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు - Telangana State Physical Education Common Entrance Test

రాష్ట్రంలో నిర్వహించిన పీఈసెట్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రతిభ చాటుకున్నారు. బీపెడ్​లో మొదటి పది ర్యాంకుల్లో ఆరింటిని కైవసం చేసుకున్నారు. డీపెట్​లోనూ తొలి పదింటిలో తొమ్మిది ర్యాంకులను వారి ఖాతాల్లో వేసుకున్నారు. పీఈసెట్​లో ఈ ఏడాది 95.94 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

పీఈసెట్​లో ప్రతిభ చాటుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు

author img

By

Published : Nov 13, 2020, 5:17 PM IST

వ్యాయామ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రాణించారు. బీపెడ్​లో మొదటి పది ర్యాంకుల్లో ఎస్సీ, ఎస్టీలు నాలుగు... బీసీలు రెండు కైవసం చేసుకున్నారు. డీపెడ్​లో తొలి పది ర్యాంకుల్లో ఎస్టీలు ఆరు, బీసీ, ఎస్సీలు మూడు చొప్పున సాధించారు. పలుమార్లు వాయిదా పడిన పీఈసెట్​లో ఈ ఏడాది 95.94 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పీఈసెట్​కు 7 వేల 368 మంది దరఖాస్తు చేసుకోగా.. 4 వేల 903 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో 4 వేల 704 మంది ఉత్తీర్ణులయ్యారు.

బీపెడ్​కు 7 వేల 368 దరఖాస్తు చేసుకొని... 2 వేల 970 మంది పరీక్షలకు హాజరు కాగా.. 2 వేల 833 మంది ఉత్తీర్ణులయ్యారు. డీపెడ్​కు 3 వేల 103 మంది దరఖాస్తు చేసుకొని 1933 మంది హాజరుకాగా.. 1871 మంది ఉత్తీర్ణత సాధించారు. పీఈసెట్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రాణించడం సామాజిక మార్పునకు పరిణామమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. వివిధ యూనివర్సిటీలు నిర్వహించిన డిగ్రీ పరీక్షలు నాలుగైదు రోజుల్లో వెలుపడే అవకాశం ఉందని.. ఈనెల 25 తర్వాత వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.