ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయన తెలియజేశారు. సంజీవయ్య నిత్యస్మరణీయులన్న పవన్.. ఆయన చేసిన సేవలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.కోటి నిధి ఏర్పాటు చేయనున్నట్లు జనసేనాని స్పష్టం చేశారు.
-
నిత్య స్మరణీయులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు.(4)🙏 pic.twitter.com/BDFRiaj3DY
— Pawan Kalyan (@PawanKalyan) October 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నిత్య స్మరణీయులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు.(4)🙏 pic.twitter.com/BDFRiaj3DY
— Pawan Kalyan (@PawanKalyan) October 17, 2021నిత్య స్మరణీయులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు.(4)🙏 pic.twitter.com/BDFRiaj3DY
— Pawan Kalyan (@PawanKalyan) October 17, 2021
కడు పేదరికంలో పుట్టిన సంజీవయ్య అసాధారణ వ్యక్తిగా ఎదిగారని చెప్పిన పవన్.. వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు బీజాలు వేశారని కొనియాడారు. రెండేళ్లే సీఎంగా ఉన్నప్పటికీ.. సంజీవయ్య ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ప్రశంసించారు. హైదరాబాద్ పరిసరాల్లోని 6 లక్షల ఎకరాలు పేదలకు పంచారని.. మొదటగా వృద్ధులు, వికలాంగుల పింఛన్లు ప్రారంభించింది సంజీవయ్యే అని పవన్ గుర్తు చేశారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని చెప్పారు. ఈ పోస్టుకు దామోదరం సంజీవయ్య ఇంటి ఫొటోలను జతచేశారు.
ఇదీ చదవండి: atchannaidu: ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజం: అచ్చెన్నాయుడు