ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నివారణలో మేము సైతం అంటూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.... హైదరాబాద్ నగర శివారు మహిళలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సింఫోనీ పార్క్ హోమ్స్ కాలనీ మహిళలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కాలనీ మహిళలు కొందరు కలిసి తమ ఇళ్లలోనే కుట్టు మిషన్లపై మాస్కులు కుట్టి... కరోనా నివారణలో అహర్నిశలు పనిచేస్తోన్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఉచితంగా అందిస్తున్నారు.
'ప్రొటెక్ట్ ద ప్రొటెక్టర్స్' అనే థీమ్‌తో 10వేల మాస్కులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే వందల సంఖ్యలో మాస్కులను తయారు చేసి పంపిణీ చేశారు. వీటి తయారీలో వారి పిల్లలు సైతం పాలుపంచుకోవడం హర్షించదగ్గ విషయం.
ఇదీ చూడండి: రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీఛార్జ్