ETV Bharat / city

నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. - యాసంగి ధాన్యం కొనుగోలు

Paddy Procurement in Telangana: ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో సాధారణ బియ్యంగానే మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం.. రైతుల నుంచి యాసంగి ధాన్యాన్ని రాష్ట్రమే కొనుగోలు చేసి.. మిల్లులకు పంపనుంది. ఈ ప్రక్రియ ఇవాల్టి నుంచే ప్రారంభం కానుంది.

paddy procurement starts from today in telangana

author img

By

Published : Apr 15, 2022, 8:19 AM IST

Paddy Procurement in Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్లకు సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. మరోవైపు జిల్లా స్థాయిలో టార్పాలిన్లు, ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు సిద్ధం చేయడంపై మార్కెటింగ్‌ శాఖతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ సీజనులో సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వడ్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో సాధారణ బియ్యంగానే మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మునుపటి మాదిరిగానే మిల్లులకు పంపనున్నారు. సాధారణ బియ్యంగా మార్చటం ద్వారా నూకలు అధిక శాతం రానున్న దృష్ట్యా మిల్లర్లకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎంత శాతం వస్తాయన్నది నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.

25న తెరవనున్న టెండర్లు..: యాసంగి ధాన్యం కొనుగోలుకు సుమారు 15 కోట్ల గోనె సంచులు అవసరమని అధికారులు అంచనా వేశారు. సుమారు ఎనిమిది కోట్ల పాత సంచులను కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఆ మేరకు టెండర్లు ఆహ్వానించింది. మరో అయిదు కోట్ల నూతన గోతాలను కొనుగోలు చేసేందుకు జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(జేసీఐ)కు లేఖ రాయనున్నారు. సీజను ఆరంభానికి ముందుగానే యాసంగిలో ఎన్ని గోనె సంచులు అవసరమవుతాయన్నది నివేదించాల్సిందిగా పౌరసరఫరాల శాఖను జేసీఐ కోరింది. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత లేకపోవటంతో అధికారులు స్పందించలేదని సమాచారం. తాజాగా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటంతో జేసీఐను సంప్రదిస్తున్నారు. గడిచిన వానాకాలంలో చేసుకున్న ఒప్పందం మేరకు మూడు కోట్ల సంచులు సరఫరా చేసేందుకు గుత్తేదారులు సుముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఆహ్వానించిన టెండర్ల ద్వారా ఎనిమిది కోట్లు సమీకరించనున్నారు. గుత్తేదారులు దాఖలు చేసిన టెండర్లను ఈ నెల 25న తెరవాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల మొదటి రెండు వారాల్లో అధిక శాతం గోతాలు అందుబాటులోకి వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.