తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేళ... తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయంతోపాటు పరిసరాలను ఫల, పుష్పాలతో అందంగా అలంకరించారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీవారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు మెుదలవుతాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. సాయంత్రం తిరుమల నాలుగు మాడవీధుల్లో ఉభయ దేవరుల సమేతంగా శ్రీ మలయప్ప స్వామి బంగారు పల్లకిపై ఊరేగుతూ..భక్తకోటికి అనుగ్రహించనున్నారు.
ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని తితిదే ఉద్యానవన విభాగం రంగురంగుల పుష్పాలతో అలంకరించింది. 8 టన్నుల పువ్వులు, 70 వేల కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిపుణులైన కళాకారులు.... పుష్పాలంకరణలో పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా తితిదే శ్రీవారి ఆర్జీత సేవలను మంగళవారం రద్దు చేసింది.
ఇదీ చదవండి: నేటి నుంచి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు