ETV Bharat / city

ఆ దంపతులు ఉచితంగా పాఠాలు చెబుతారు... ఫోన్లూ ఇస్తారు! - ఆదివారం కథనాలు

ఎనభై ఏళ్లంటే ఏ బాదరబందీలూ లేకుండా విశ్రాంతి తీసుకోవాలని కోరుకునే దశ. బెంగళూరుకి చెందిన విశ్రాంత ఇంజినీర్‌ బద్రీనాథ్‌ విఠల్‌, ఆయన సతీమణి ఇందిర మాత్రం అందుకు పూర్తి భిన్నం.  నలుగురికీ సాయం చెయ్యాలనుకునే వీళ్లు తమలాంటి మరికొందరితో కలిసి ఆన్‌లైన్లో వందలమందికి ఉచితంగా పాఠాలు చెబుతున్నారు. అంతేకాదు,  పేద విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు లేక ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవ్వలేకపోతున్నారని తెలుసుకుని దాతల సాయంతో వారికి స్మార్ట్‌ఫోన్లనూ అందిస్తున్నారు.

old couple conducting free tutions to 500 students

author img

By

Published : Mar 28, 2021, 1:23 PM IST

‘అమ్మా... పిల్లలిద్దరినీ ట్యూషన్‌కి పంపిద్దామనుకుంటున్నా. కానీ ఫీజు కట్టేందుకు డబ్బు లేదు. కొంచెం అప్పుగా ఇస్తే కొద్ది కొద్దిగా తీర్చుకుంటా’... ఇలా ఆరేళ్ల కిందట తమ పనిమనిషి అడగ్గా... బద్రీనాథ్‌ దంపతులు డబ్బులివ్వలేదు. బదులుగా ‘మేమే ఉచితంగా ట్యూషన్‌ చెబుతాం పిల్లల్ని పంపించు’ అన్నారు. అలా ఇద్దరితో మొదలైన ఆ ఉచిత ట్యూషన్‌ ప్రస్థానంలో ప్రస్తుతం 500ల మందికి పైగా విద్యార్థులు చేరారు. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన బద్రీనాథ్‌ సివిల్‌ ఇంజినీర్‌గా వివిధ కంపెనీల్లో పని చేసి పదవీవిరమణ చేశారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసిన ఆయన భార్య ఇందిరకు కూడా హిందీ, ఆంగ్లం భాషల్లో పట్టుంది. ఇంకేముందీ... వారి బోధనలో పనిమనిషి పిల్లలు చదువులో రాణిస్తుండటంతో ఇరుగుపొరుగు పిల్లలు కూడా ట్యూషన్లకు రావటం మొదలు పెట్టారు. కరోనాకి ముందు ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకూ దాదాపు ముప్ఫై మందికి ట్యూషన్లు చెప్పేవారా దంపతులు. లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్‌ ట్యూషన్లపైన దృష్టిపెట్టారు. వీరి ట్యూషన్ల గురించి ఆ నోటా ఈ నోటా విని మరికొందరు విద్యార్థులు చేరారు. దాంతో ఆ దంపతులు రోజంతా ట్యూషన్లు చెప్పేవారు. విద్యార్థులు పెరగడంతో అధ్యాపకుల అవసరమూ పెరిగింది.

50మంది స్వచ్ఛంద బోధకులు

తనకున్న పరిచయాలతో ఆయా సబ్జెక్టుల కోసం అధ్యాపకులను సిద్ధం చేసిన బద్రీనాథ్‌ గూగుల్‌ మీట్‌ ద్వారా ట్యూషన్‌ ప్రారంభించారు. ఐటీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, పట్టభద్రులు, విద్యార్థులు, గృహిణులు, రిటైర్డ్‌ ఉద్యోగులు... ఇలా ప్రస్తుతం 50మంది బద్రీనాథ్‌ ఉచిత ట్యూషన్‌ వేదికలో పాఠాలు బోధిస్తున్నారు. ఆయా ట్యూటర్ల వృత్తి జీవితానికి అనుగుణంగా టైమ్‌ టేబుల్‌ను రూపొందించి తరగతులు నిర్వహిస్తారు. అలా అయిదో తరగతి నుంచి మొదలైన ఉచిత ట్యూషన్‌ సేవలు ఇప్పుడు ఇంజినీరింగ్‌ కోర్సుల వరకూ విస్తరించాయి. స్పోకెన్‌ ఇంగ్లిష్‌, వ్యక్తిత్వ వికాసం, ప్రాంతీయ భాషా నైపుణ్యంపై కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. పెద్ద తరగతుల విద్యార్థులకు సబ్జెక్టులకు సంబంధించి సందేహాలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటివారికోసం ప్రత్యేకంగా ట్యూటర్లను ఏర్పాటు చేస్తారు. అసోం, రాజస్థాన్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో విధులు నిర్వహించిన బద్రీనాథ్‌ విఠల్‌ తన పరిచయాలతో అక్కడి నుంచి కూడా ట్యూటర్లను ఏర్పాటు చేయటం విశేషం. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకూ నిర్వహించే ట్యూషన్‌ లాజిస్టిక్‌ వ్యవస్థను ఐగేట్‌ ఉద్యోగి ముత్తులక్ష్మి పర్యవేక్షిస్తుంటారు. ప్రతి తరగతిలో బద్రీనాథ్‌ లాగ్‌ ఇన్‌ అవుతూ ఏవైనా సమస్యలు తలెత్తితే సవరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కర్ణాటకలోని పదికిపైగా జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ ఉచిత ట్యూషన్‌ సేవలను పొందుతున్నారు.

చిన్నారికి మొబైల్​ అందిస్తూ...

ఉచితంగా ఫోన్లు

ఆన్‌లైన్‌ తరగతులకు స్మార్ట్‌ఫోన్లు కావాలి. వాటిని కొనే స్థోమత లేక ఎంతోమంది పిల్లలు కరోనా సమయంలో చదువుకి దూరమయ్యారు. తమ దగ్గరా ఉచిత ట్యూషన్ల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారిలో దాదాపు 80శాతం మందికి ఫోన్లు లేనట్లు బద్రీనాథ్‌ గుర్తించి దాతలెవరైనా వారికి మొబైల్‌ ఫోన్లను అందించాలని కోరారు. దాంతో తన మిత్రులు, దాతల నుంచి దాదాపు వంద మంది విద్యార్థులకు ఫోన్లు అందాయి. అవి నేరుగా లబ్ధిదారుడి చిరునామాకే వెళ్తాయి. వీటికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక లావాదేవీలనూ తన దగ్గరకు తేవద్దని బద్రీనాథ్‌ స్పష్టంగా చెబుతారు. ఈ ఫోన్లు అందుకున్న విద్యార్థులు వాటిని ఆన్‌లైన్‌ పాఠాల కోసమే వినియోగించేలా పిల్లల తల్లిదండ్రులకూ, పాఠాశాలల యాజమాన్యాలకీ సూచనలిస్తారు. ఆర్థిక స్థోమత ఉన్నవారెవరైనా ఈ ఉచిత ట్యూషన్‌లో చేరాలనుకుంటే వారి తల్లిదండ్రులు తప్పకుండా ఒక పేద విద్యార్థికి ఫోన్‌ ఇప్పించాలని కోరతారు. విద్యార్థులూ, దాతలూ వీరిని 99018 41508, 99004 08760 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు. వయసు మీదపడినా పేద విద్యార్థుల చదువుకోసం ఇంతగా తపన పడుతున్న బద్రీనాథ్‌ దంపతులు నిజంగా ఎందరికో స్ఫూర్తిదాతలు.

ఇదీ చూడండి: 'ఈ హోలీతో కలర్​ఫుల్​ లైఫ్​కి వెల్​కమ్ చెబుదాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.