ETV Bharat / city

సాహసం: పోటెత్తుతున్న నదిని ఈదుకుంటూ విధులకు...

అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు ఇద్దరు కార్యకర్తలు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ఎండిన ఆనపకాయలను వీపునకు కట్టుకుని ఈతగాళ్ల సాయంతో నదిని దాటి కేంద్రాలకు చేరుకుంటున్నారు.

Odisha Anganwadi activists goes to work by swimming through a river
నదిని ఈదుకుంటూ విధులకు
author img

By

Published : Oct 3, 2020, 1:36 PM IST

ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా, చిత్రకొండ మండలం కటాఫ్‌ ప్రాంతంలో రలేగఢ్‌ పంచాయతీలోని సువాపల్లి, నేరుడిపల్లి, సువామగోల్‌ ఇంకో నాలుగు గ్రామాలు నదికి అవతల కొండల మీద ఉంటాయి. ఈ గ్రామాల్లోని చిన్నారులు, గర్భిణిలకు పౌష్టికాహారం అందించేందుకు సువాపల్లి, నేరుడుపల్లిలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.

వాటిల్లో పనిచేస్తున్న కార్యకర్తలు హేమలత శిశ, ప్రమీల పల్మెల వర్షాకాలం వస్తే నది దాటుకుని వెళ్లాలి. ఇటీవల వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. గల్లంతయ్యే ప్రమాదమున్నా సాహసం చేసి నదిని దాటుతున్నారు. వారంలో ఒకరోజు కొండలపై ఉన్న గ్రామాలకు వెళ్లి చిన్నారులకు, గర్భిణిలకు పోషకాహారం అందజేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.