హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని కాపీ కొట్టాడు ఓ వ్యక్తి. తన వ్యక్తిగత వైబ్సైట్లో ఈ వివరాలన్ని నమోదు చేశాడు. అంతర్జాలంలో నుమాయిష్ సమాచారం వెదికితే మొదట కనపడేది ఇతని వెబ్‌సైటే. సాంకేతికతను ఉపయోగించి మోసం చేసినందకు గాను ఆ వ్యక్తికి సీసీఏస్ సైబర్ క్రైం పోలీసులు తాఖీదులు జారీ చేశారు.
అధికారిక వెబ్సైట్ వెతికితే కనిపించేది నకిలీదే...
మల్లిఖార్జునరావు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు అచ్చం నుమాయిష్ వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఎగ్జిబిషన్లో జరిగే రోజువారీ కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలను మల్లికార్జునరావు తన నుమాయిష్ వైబ్సైట్లో ఉంచారు. ఎగ్జిబిషన్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నెటిజన్లు అంతర్జాలంతో శోధించగానే ఈ వెబ్ సైట్ ప్రత్యక్షమవుతోంది. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కార్యాలయానికి రావాలంటూ మల్లిఖార్జున్‌ను పోలీసులు ఆదేశించారు. ఇవాళ ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
మల్లిఖార్జున రావు మరోకోణం..
మల్లికార్జునరావుకు అటిజంతో బాధపడుతున్న కుమారుడున్నాడు. అటిజం బాధితులకు సేవ చేయాలన్న లక్ష్యంతో 'స్మైల్' అనే స్వచ్ఛంద సేవాసంస్థను నిర్వహిస్తున్నాడు. గతేడాది నుమాయిష్‌లో ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశాడు. ఎగ్జిబిషన్ సొసైటీకీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నుమాయిష్ పేరుతో ముంబయిలో ట్రేడ్ లైసెన్స్ ధ్రువపత్రాన్ని తీసుకున్నాడు. ఎగ్జిబిషన్ సొసైటీ వారిని కలిసి ఈ వివరాలను తెలిపేలోపు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు.
చర్యలు తప్పవు...
ఎగ్జిబిషన్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాలను అక్రమంగా మల్లికార్జునరావు తన వెబ్ సైట్లో ఉంచడం నేరమేనని పోలీసులు తెలిపారు. తాఖీదులకు సమాధానం ఇచ్చిన ఆనంతరం అతడిపై చట్టరమైన చర్యలు చేపట్టనున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.