ETV Bharat / city

రెగ్యులర్‌ రైళ్లు ఇప్పట్లో లేనట్లే.. - telangana varthalu

రెగ్యులర్​ ఎప్పటి నుంచి నడుస్తాయా అని ప్రయాణికులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ మార్చి నెలాఖరు వరకు పొడిగింది. ప్రయాణ రాయితీల రద్దుతో ప్రయాణికులపై ఛార్జీల భారం పడుతోంది. సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు వంటి వివిధ వర్గాలకు రైలు ప్రయాణం గతంతో పోలిస్తే భారంగా మారింది.

రెగ్యులర్‌ రైళ్లు ఇప్పట్లో లేనట్లే..
రెగ్యులర్‌ రైళ్లు ఇప్పట్లో లేనట్లే..
author img

By

Published : Jan 17, 2021, 7:47 AM IST

ప్రయాణాలు బాగా పెరగడం వల్ల రెగ్యులర్‌ రైళ్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. దీనిప్రకారం రెగ్యులర్‌ రైళ్లు ఏప్రిల్‌, ఆ తర్వాతే అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొవిడ్‌కు ముందు రెగ్యులర్‌ సర్వీసులు రోజుకు 13 వేల పైచిలుకు నడిచేవి. కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో 2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకల్ని రద్దుచేసిన రైల్వేశాఖ మే నెల నుంచి దశలవారీగా పట్టాలు ఎక్కిస్తూ వస్తోంది. వీటిని ప్రత్యేక ట్రైన్లుగానే నడుపుతోంది. చాలావాటిల్లో బెర్తులు వారం, పదిరోజుల ముందే నిండుతున్నాయి. అనేక రూట్లలో డిమాండ్‌కు తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. రైల్వే వర్గాలు మాత్రం 250 రైళ్లలోనే పరిమితంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని..ఈ విధానం 2015 నుంచే అమల్లో ఉందని స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే రైళ్లు నడుపుతున్నాం. రిజర్వేషన్‌ ఉన్నవారినే అనుమతిస్తున్నాం. సాధారణ స్థితిలో అన్ని రైళ్లు నడిపితే నిత్యం 2.30 కోట్ల మందిని చేరవేయాల్సి ఉంటుంది. బెర్తులు, సీట్లతో నిమిత్తం లేకండా ప్రయాణికులు కిక్కిరిసిపోతారు. కొవిడ్‌కు టీకాలు వేయడం శనివారం నుంచి ప్రారంభమైనా సాధారణ ప్రజలకు, అన్ని వయసుల వారికి అందుబాటులోకి వచ్చేసరికి సమయం పడుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని రైల్వే ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

అవే రైళ్లు.. ప్రత్యేకం పేరు

తిరిగేది అదే మార్గం.. అవే బోగీలు.. ప్రయాణ సమయం కూడా అదే. రైల్వేశాఖ మాత్రం రెగ్యులర్‌ రైళ్లనే ప్రత్యేకబండ్లుగా నడిపిస్తోంది. ఈ నిర్ణయం మూలంగా ఓవైపు కొంత అదనపు ఛార్జీలు ఉంటే.. రాయితీ ప్రయాణం పూర్తిగా పోయింది. సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు వంటి వివిధ వర్గాలకు రైలు ప్రయాణం గతంతో పోలిస్తే భారంగా మారింది.

సబర్బన్‌, స్థానిక రైళ్లపై రాష్ట్రానికో రకంగా

రాజధాని నగరాలకు చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల నుంచి లక్షలమంది వచ్చిపోతుంటారు. ఇలాంటివారికి అటు చిన్నస్టేషన్లలో స్టాపేజీతో పాటు తక్కువ ఛార్జీలతో సబర్బన్‌, ప్యాసింజర్‌ రైళ్లు ఎంతో ఉపయోగపడతాయి. ముంబయిలో చాలాకాలం నుంచి సబర్బన్‌ సర్వీసులకు రైల్వేశాఖ అనుమతించింది. హైదరాబాద్‌ నగరంలో అటు ఎంఎంటీఎస్‌ రైళ్లకు, చుట్టుపక్కల జిల్లాల నుంచి సబర్బన్‌ సర్వీసులకు ఇంకా అనుమతివ్వలేదు.

దేశంలో తిరుగుతున్న ప్రత్యేక రైళ్లు..

  • మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌లు: 1,058
  • సబర్బన్‌ సర్వీసులు: 4,087
  • ప్యాసింజర్‌ రైళ్లు: 188

ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో గెలిచిన అభ్యర్థులతో గెజిట్.. మిగిలింది మేయర్ ఎన్నికే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.