క్లూస్ నిపుణుల విభాగానిది పోలీసు శాఖలో విశేష పాత్ర. నేరం జరిగిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకొని వేలి ముద్రల నుంచి వివిధ రకాల ఆధారాలను క్లూస్ నిపుణులు సేకరిస్తారు. ప్రధానంగా శాస్త్రీయ ఆధారాలు సేకరించడంలో ప్రత్యేకతను కనబరుస్తారు. ఆధారాల సేకరణ వలన ఎన్నో క్లిష్టమైన కేసులు చిక్కుముడి వీడాయి. సైబరాబాద్ పోలీసులు ఈ బృందాన్ని మరింత పటిష్ఠం చేశారు.
కమిషనరేట్‌లోని డీసీపీల పరిధిలో ఒక్కో వాహనం చొప్పున మొత్తం మూడు వాహనాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్యను పెంచారు. ప్రస్తుతం ఏసీపీ డివిజన్‌కు ఒక్కో వాహనం చొప్పున మొత్తం తొమ్మిది వాహనాలు... వీటితో పాటు ఆధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, పేట్‌బషీరాబాద్, బాలానగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్ డివిజన్లకు పూర్తి స్థాయిలో క్లూస్ నిపుణుల వాహనాలు, పరికరాలు ఉపయోగంలోకి వచ్చాయి. ఈ వాహనాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు.
క్లూస్ నిపుణుల బృందం కోసం వాహనాలు సంఖ్య పెంచడం వల్ల ఘటనా స్థలాలనికి మరింత వేగంగా చేరుకోగలుగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.