రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, పవర్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఆగ్రోబేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్‌టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాలకు చెందినవి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 169 ఫార్మా, కెమికల్స్, 87 పవర్, 165 ప్లాస్టిక్, రబ్బర్, 280 ఇంజీనీరింగ్, 195 ఆగ్రో బేస్డ్, 46 ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, 166 గ్రానైట్ స్టోన్ క్రషింగ్, 69 పేపర్ ప్రింటింగ్, 63 టెక్స్ టైల్, 117 సిమెంట్, 12 ఏరోస్పేస్, డిఫెన్స్, 820 ఇతర పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నాయి.
ఏకంగా 79 శాతం వృద్ధి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం అంతర్జాతీయంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. దేశ, విదేశాల పెట్టుబడులు ఆకర్షించడంలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8%గా ఉంటే.. తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించింది. చాలా మల్టీ నేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. నూతన పారిశ్రామిక పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి.. జనవరి 2020 నాటికి రూ.2,04,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా 12,427 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్ర పారిశ్రామిక రంగం జాతీయ సగటు కంటే గణమైన వృద్ధి రేటు కలిగి ఉంది. టీఎస్‌ఐపాస్ ద్వారా పరిశ్రమలు హైదరాబాద్, దాని చుట్టూనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యాయి. గ్రామీణ జిల్లాల్లో పరిశ్రమల స్థాపన వల్ల స్థానిక గ్రామాల్లోని నిరుద్యోగ యువకులకు ఉపాధి లభిస్తోంది.
రూ 5.9 లక్షల కోట్ల పెట్టుబడులు..
తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8%గా ఉంటే.. తెలంగాణ ఏకంగా 79 శాతం వృద్ధి సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ 5.9 లక్షల కోట్లకు పెరిగాయి. పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాదు, ఆయా ప్రాజెక్టుల అమలు విషయంలోనూ తెలంగాణ ముందంజలో ఉంది. అసోచామ్ నివేదిక ప్రాకారం.. పారిశ్రామికరంగ వృద్ధి రేటు : 2013-14 ఆర్థిక సంవత్సరంలో 0.4 శాతం, వృద్ధిరేటుతో ఉన్న పారిశ్రామిక రంగంలో కూడా అదనంగా 5.4 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8 శాతం వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది.
ఇదీ చూడండి : పెళ్లంటూ పలకరించింది.. కోటి కాజేసింది!