పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో చిత్రీకరించిన లఘు చిత్రాలకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అందజేసిన అవార్డుల్లో హైదరాబాద్ యువత సత్తా చాటింది. సీఎంఎస్ వాతావరణ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాల్లో సునీల్ సత్యవోలు తెరకెక్కించిన 'ద సైలెంట్ వాయిస్' లఘు చిత్రానికి ద్వితీయ పురస్కారం దక్కింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అదనపు కార్యదర్శి చేతుల మీదుగా సునీల్, అన్షుల్ పురస్కారాన్ని అందుకున్నారు.
హైదరాబాద్కు చెందిన సునీల్ సాప్టవేర్ సంస్థ నిర్వహణతోపాటు సామాజిక అంశాలపై ఆసక్తితో ఇంటి సమీపంలో కాలుష్యపు కాసారంగా మారుతున్న చెరువు ఇతివృత్తంతో లఘు చిత్రాన్ని తీశారు. రెండున్నర నిమిషాలతో మాటలు లేకుండా పర్యావరణ దుస్థితిని కళ్లకు కట్టిన ఆ లఘు చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లోని పలు సంస్థలు తమ లఘు చిత్రానికి అవార్డులు ప్రకటించినట్లు షార్ట్ఫిల్మ్ రచయిత సునీల్, డైరెక్టర్ అన్షుల్ సిన్హా చెప్పారు. 'ద సైలెంట్ వాయిస్' లఘు చిత్రం తెచ్చిన గుర్తింపుతో మరిన్ని సమాజానికి ఉపయోగపడే చిత్రాలు తీస్తామని వారు చెబుతున్నారు.
ఇవీ చూడండి: నడిరోడ్డుపై 'భూతాల' పరుగులు- జనం నవ్వులు