ETV Bharat / city

'దేవాలయ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'

దేవాదాయశాఖ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే రాజాసింగ్​ స్పష్టం చేశారు. మజ్లీస్​తో జతకట్టడం వల్లే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు దెబ్బతగిలిందన్నారు. ఇంకా మజ్లీస్‌తో పోతే సర్వనాశనం అవుతారన్నారు. దేవాలయ భూములను కాపాడాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

mla raja Singh on temple land issue
mla raja Singh on temple land issue
author img

By

Published : Dec 17, 2020, 2:52 AM IST

mla raja Singh on temple land issue

హైదరాబాద్ ఉప్పుగూడలోని పంట మైసమ్మ దేవాలయానికి చెందిన భూమిని మజ్లీస్‌ నేతలు కబ్జా చేయాలని కుట్ర చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ దేవాలయానికి 8 ఎకరాల 15 గుంటల దేవాదాయ భూమి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ దేవాలయ స్థలంపై మజ్లీస్‌ నేతల కన్నుపడిందని... కబ్జా చేసి అమ్ముకోవాలని 3 సార్లు ప్రయత్నింటి విఫలమయ్యారని రాజాసింగ్ చెప్పారు.

దేవాదాయశాఖ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దేవాదాయశాఖ మంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మజ్లీస్​తో జతకట్టడం వల్లే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు దెబ్బతగిలిందన్నారు. ఇంకా మజ్లీస్‌తో పోతే సర్వనాశనం అవుతారన్నారు. దేవాలయ భూములను కాపాడాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'పాతబస్తీలో ఆలయ భూముల పరిరక్షణకు 24గంటల డెడ్​లైన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.