కుల, మతాలకతీతంగా ప్రజాసేవ చేసే సంస్థలను అందరూ గౌరవించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ఆలయాల అర్చకులకు జవహర్‌నగర్‌లోని లలితా పరమేశ్వరి దేవాలయం సేవా భారత్ డైరెక్టర్ బొల్లం ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, రెండు కేజీల వంట నూనె, ఇతర నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
లాక్డౌన్ సమయంలో అన్ని వర్గాల ప్రజలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయ సహకారాలు ప్రశంసనీయమని ముఠా గోపాల్ అన్నారు. వ్యవస్థలోని అభాగ్యులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మా, ముఠా నరేష్, జైసింహ, సిందిరి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా