ETV Bharat / city

ఆ పార్టీలను ప్రజలు పట్టించుకోవద్దు: మంత్రి వేముల - GHMC election campaign news

ఎన్నికల కోసం ఇష్టారీతిన మాట్లాడే భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గాజుల రామారం డివిజన్​లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.

minister vemula prashanth reddy said People don't care about those parties
ఆ పార్టీలను ప్రజలు పట్టించుకోవద్దు: మంత్రి వేముల
author img

By

Published : Nov 27, 2020, 11:53 AM IST

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ పరిధిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హెచ్ఎఎల్ కాలనీ, వీనస్ ఎంక్లేవ్, రావి నారాయణరెడ్డి నగర్లలో పర్యటించారు.

గాజుల రామారం డివిజన్​లో తెరాస బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థి రావుల శేషగిరి రావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వేముల కోరారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. నిరంతరం ప్రజల కోసమే పనిచేసే తెరాస పార్టీకి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

గత 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ వచ్చిన ఆరేండ్ల కాలంలో చేసి చూపించారని మంత్రి పేర్కొన్నారు. తెరాస హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులివ్వకుండా కేంద్రం అడుగడుగునా వివక్ష చూపిస్తుందని.. ఎన్నికల వేళ మత రాజకీయాలు చేసే భాజపాకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని అన్నారు.

ఇదీ చూడండి : వేదిక పైనుంచి కిందపడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.