సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో తెరాస యువ నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. బోయిన్‌పల్లిలో 11 ఏళ్లుగా.. టింకు గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటం సంతోషకరమని మంత్రి అభినందించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను టింకు గౌడ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల నుంచి అమ్మవారు అందర్ని కాపాడాలని వేడుకున్నట్లు తెలిపారు. కరోనా వల్ల వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించలేకపోతున్న పరిస్థితుల్లో... ఎవరి ఇళ్లలో వారు జాగ్రత్తగా పూజలు చేసుకోవాలని మంత్రి సూచించారు.