రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే కరోనాపై స్పందించిందని... ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కనిపించని శత్రువుతో పోరాడుతున్న ప్రభుత్వంపై చిల్లర రాజకీయాలు సరికాదన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు... ఆసుపత్రుల ముందు ధర్నాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.
హరితహారం....
జిల్లా ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. జంగల్ బచావో జంగల్ నినాదంతో చేపట్టే హరితహారం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంగా చేపట్టాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించినట్లు వివరించారు.
ఇదీ చూడండి: పెద్దమంగళారం వణికింది: అపోలోలో కరోనా పాజిటివ్... గచ్చిబౌలిలో నెగిటివ్