AP Minister peddi reddy on CBN : రాబోయే ఏపీ శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా అందిస్తానని ఆ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెబాటలో భాగంగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
కుప్పంలో గ్రానైట్ మాఫియా ఉందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అదంతా వాస్తవమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.
ఇదీ చూడండి: CBN Video: జనసేనతో తెదేపా పొత్తుపై.. చంద్రబాబు చమత్కారం..