Minister resign: సాధారణంగా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలపై వివిధ రకాలైన ఆరోపణలు రావడం సహజమే. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కొందరు రాజకీయ నేతలు తమ పదవులను వదులుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ కొందరు నిజాయితీపరులైన నేతలు మాత్రం పదవులను వదిలేస్తుంటారు. తాజాగా గోవాలో భాజపాకు చెందిన మంత్రి మిలింద్ నాయక్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనపై లైంగిక ఆరోపణలు (sexual harassment allegations) రావడమే ఇందుకు కారణం.
milind naik: మిలింద్ నాయక్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఒక మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్ పార్టీ గోవా అధ్యక్షుడు ఆరోపించారు. మిలింద్ నాయక్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మంత్రిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఈ పరిణామాలన్నీ గమనించిన మంత్రి మిలింద్ నాయక్.. ఏకంగా తన మంత్రి పదవికే రాజీనామా చేశారు. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్న ఉద్దేశంతో మిలింద్ నాయక్ మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆ ప్రకటనలో పేర్కొంది.