గండిపేట సమీపంలోని కోకాపేటలో నిర్మిస్తున్న క్రిస్టియన్ భవన నిర్మాణ నమూనాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ల, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. క్రిష్టియన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 కోట్లు వెచ్చించిందని తెలిపారు.
అన్ని సౌకర్యాలతో సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయనున్నట్టు మంత్రి వివరించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఉన్నతాధికారులు షానవాజ్ ఖాసీం, కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: కుండపోత వర్షంతో అతలాకుతలమైన జంటనగరాలు