కాచిగూడ రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. మానవతప్పిదం వల్లే కాచిగూడలో రైలు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. రైళ్లు వేగంగా కదలకపోవడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని వెల్లడించారు. సుమారు 8 గంటలపాటు శ్రమించి ఎన్డీఆర్ఎఫ్, రైల్వే సిబ్బంది లోకోపైలట్‌ను రక్షించారని పేర్కొన్నారు.
ఇవీచూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్ వీడియో