ETV Bharat / city

Harishrao On Sirivennela: సమాజాన్ని తట్టిలేపే పాటల్ని రాసిన ఘనత సిరివెన్నెలదే

సినిమా పాటల్లో సిరివెన్నెలది ప్రత్యేక స్థానమని... అశ్లీల, ద్వంద్వార్థాలు లేని పాటలు రాసిన గొప్ప రచయితని మంత్రి హరీశ్​రావు కొనియాడారు. కొత్తతరం గీత రచయితలు సిరివెన్నెలను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ సూచించారు. ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయానికి హరీశ్‌, తలసాని నివాళి అర్పించారు.

author img

By

Published : Dec 1, 2021, 12:05 PM IST

Talasani On Sirivennela
Talasani On Sirivennela tributses to sirivennela

Harishrao On Sirivennela: వ్యాపార ప్రధానమైన సినీరంగంలో సమాజాన్ని తట్టిలేపే పాటల్ని రాసిన ఘనత సిరివెన్నెల సీతారామశాస్త్రికే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయానికి హరీశ్‌ నివాళి అర్పించారు. సినిమా పాటల్లో సిరివెన్నెలది ప్రత్యేక స్థానమని... అశ్లీల, ద్వంద్వార్థాలు లేని పాటలు రాసిన గొప్ప రచయిత అని కొనియాడారు.

Talasani On Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు. దాదాపు 800 చిత్రాలకు 3 వేలకు పైగా పాటలు రాశారన్నారు. సిరివెన్నెల పాటల్లో చక్కని తెలుగు, కమ్మదనం ఉంటుందన్నారు. 11 సార్లు నంది అవార్డులు, పద్మశ్రీ అందుకోవడం చాలా గొప్ప విషయమని తెలిపారు. కొత్తతరం గీత రచయితలు సిరివెన్నెలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సిరివెన్నెల పార్థివదేహానికి తలసాని నివాళి అర్పించారు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల మరణం ఆయన కుటుంబానికే కాకుండా యావత్‌ తెలుగు జాతికి తీరని లోటన్నారు.

Harishrao On Sirivennela: సమాజాన్ని తట్టిలేపే పాటల్ని రాసిన ఘనత సిరివెన్నెలదే

ఇకలేరు..

Sirivennela Sitaramasastri died: ప్రముఖ గేయ రచయిత 'సిరి వెన్నెల' సీతారామశాస్త్రి(66) తుదిశ్వాస విడిచారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'సిరివెన్నెల' చిత్రంలో 'విధాత తలపున' గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.