రాష్ట్రంలో దాదాపు 1500 మంది తలసేమియా రోగులు ఉన్నారని మంత్రి ఈటల తెలిపారు. వారికి నెలకు రెండుసార్లు రక్త మార్పిడి జరగాలన్నారు. రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. రక్తం ఇవ్వడానికి దాతలు 104, 108 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
పది వేల మందికి పైగా డయాలసిస్ రోగులు ఉన్నారు..ప్రభుత్వం తరఫున సహకరిస్తాం. క్యాన్సర్ రోగులకు రేడియేషన్ జరగాలి. అవసరమైతే వాహనాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తాం. వైద్య పరమైన సమస్యల కోసం టెలీమెడిసిన్ సౌకర్యం అందుబాటులో ఉంది. వెయ్యి వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇచ్చాం. దాదాపు రూ.70 కోట్ల విలువైన సామగ్రి కొనుగోలుకు నిర్ణయించాం. - మంత్రి ఈటల
హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు బయటకు రావొద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సరకులు చేరవేసి.. వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. 101 హాట్ స్పాట్ ప్రాంతాల్లో వారికి అన్నీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు.
ఇవీ చూడండి: వరి కోతలను బట్టి దశల వారీగా కొనుగోలు కేంద్రాలు'