ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటం వల్ల బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఎంఆర్ఐ, సీటీ స్కాన్ లాంటి మరికొన్ని పరీక్షలు కూడా అవసరమని వైద్యులు నిర్ణయించారు. వాటి కోసమే కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు వెళ్లారు.