ETV Bharat / city

దిశ ఘటనలో పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారు: మందకృష్ణ

దిశ ఘటనలో పోలీసులు పరిధి దాటి ఎన్​కౌంటర్​ చేశారని ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హత్యాచార నిందితులను శిక్షించడంలో జాప్యానికి నిరసనగా డిసెంబర్​ 24న ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

manda krishna comments on disha accused encounter
దిశ ఘటనలో పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారు: మందకృష్ణ
author img

By

Published : Dec 12, 2019, 7:48 PM IST

Updated : Dec 12, 2019, 11:46 PM IST

డిసెంబర్​ 24న ఇందిరాపార్కు వద్ద మహాదీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలపై జరిగిన దాడుల నిందితులను శిక్షించడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

దిశ కేసులో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఎవరి విధులు వారు నిర్వహించాలని సూచించారు. భవిష్యత్​లో న్యాయవ్యవస్థ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే సుప్రీంకోర్టు దిశ నిందితుల ఎన్​కౌంటర్ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసిందని మందకృష్ణ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యేలా ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటుచేయాలని డిమాండ్​ చేశారు.

దిశ ఘటనలో పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారు: మందకృష్ణ

ఇవీచూడండి: ప్రపంచ మీడియాలో 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​కు పెద్దపీట

TG_Hyd_34_12_Mandha Krishna On Maha Deeksha Sabha_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులకు మట్టి అంటకుండా... దిశ నిందితులను ఎన్ కౌంటర్ పేరుతో హత్యలు చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దిశ సామాజిక వర్గ మెప్పుకోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల పై జరిగిన హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించడంలో... జరుగుతున్న జాప్యానికి నిరసనగా డిసెంబర్ 24న ఇందిరాపార్క్ వద్ద మహాదీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గత రెండేళ్లలో దేశంలో మహిళలాలపై జరిగిన దాడులు , హత్యలు , హత్యాచారాలకు సంబందించిన 35 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అయినప్పటికీ దిశ కేసులో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను శాశిస్తూ... పక్క రాష్ట్రమైన ఏపీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న సామాజిక వర్గం అదేశాలనుసరంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చర్యకు ఆదేశాలు ఇచ్చారన్నారు. దానికి ఉదాహరణనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు సభలో కేసీఆర్ కు సెల్యూట్ చేయడం అని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఎవరి విధులు వారు నిర్వహించాలని... రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని పేర్కొన్నారు. కానీ పోలీసులు దిశ ఘటన విషయంలో నేర పరిశోధన చేయకుండా... న్యాయ వ్యవస్థ చెయ్యాల్సిన నేరాన్ని నిర్దారణను పోలీసులు చేసి ఎన్ కౌంటర్ చేశారని ఆరోపించారు. పోలీసులు వారి పరిధిని దాటి న్యాయ వ్యవస్థ హక్కులను హరించారని అన్నారు. దేశంలో అరుదైన ఘటనలు అయిన మహాత్మాగాంధీ , ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ హత్యలు , ముంబై దాడులు అని , ఆ ఘటనలలో కూడా పోలీసులు న్యాయ వ్యవస్థకు లోబడి పనిచేశారే తప్ప , ఎన్ కౌంటర్లు చేయలేదని గుర్తు చేశారు. భవిష్యత్తు లో న్యాయవ్యవస్థ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి , ఎస్టీ , బిసి , మైనారిటీ మహిళలాలపై జరిగిన హత్యాచారాలు , హత్యలకు పాల్పడిన కేసులపై... ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి , సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో అట్టడుగు ప్రజలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. బైట్: మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
Last Updated : Dec 12, 2019, 11:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.