ETV Bharat / city

బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం.. రియాక్టర్ పేలి 8మందికి గాయాలు - వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలుడు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలుడు బీభత్సం సృష్టించింది. పరిశ్రమలో మంటలు చెలరేగగా.. కార్మికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. 8 మంది కార్మికులకు గాయలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.

వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలుడు.. బీభత్సం సృష్టించిన మంటలు

author img

By

Published : Dec 12, 2020, 5:45 PM IST

బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం.. రియాక్టర్ పేలి 8మందికి గాయాలు

రోజులాగే విధుల్లో ఉన్న కార్మికులు ఊహించని ప్రమాదానికి బెంబేలెత్తిపోయారు. వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలిపోగా ప్రాణభయంతో పరిగెత్తారు. పేలుడు ధాటికి పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులకు బాచుపల్లిలోని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని వెంకటేశ్‌, రిషికేశ్‌ కుమార్‌, ఈరేశ్‌ రేష్మా, శ్రీకృష్ణ, విద్యా భాను, రాజా రావు, రజినీ, ఆనంది పార్థీలుగా గుర్తించారు. పేలుడు సంభవించిన యూనిట్‌-1లో దాదాపు 40 మంది కార్మికులు విధులు నిర్వహస్తున్నట్లు తెలుస్తోంది.పేలుడు వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమలో భవనం పైకప్పు తునాతునకలైంది.

బొల్లారంలో అగ్నిప్రమాదంలో గాయపడిన వారు

సమీప ఫ్యాక్టరీల్లోని రియాక్టర్లను..

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ముందుగా 4 అగ్నిమాపక శకటాలు చేరుకోగా మరికొన్ని శకటాలను అధికారులు తెప్పించారు. దట్టంగా పొగలు అలుముకోగా పరిశ్రమలో సహాయ చర్యలకు ఆటంకం తలెత్తింది. చుట్టుపక్కల పరిశ్రమల నుంచి కార్మికులను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమీప ఫ్యాక్టరీల్లోని రియాక్టర్లను చల్లబరిచారు. వేడికి అవి కూడా పేలకుండా చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో భోజన విరామం కావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఎనిమిది మంది గాయపడగా.. షిఫ్ట్‌ఛార్టుల ఆధారంగా ఎంతమంది ఉన్నారనేది గుర్తించారు.

బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం

ఇవీ చూడండి: మంత్రి ఈటలను కలిసిన మాజీ మంత్రి గీతారెడ్డి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.