ETV Bharat / city

రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోంది: జేపీ

రాజకీయాల్లో డబ్బు పాత్ర పెరిగిపోవడంతో సంపన్నులే ఎన్నికల బరిలో దిగుతున్నారని లోక్​సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటై 23 ఏళ్లు అయిందని లోక్​సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. దీనిద్వారా ఇప్పటివరకు 3 రాజ్యాంగ సవరణలు, 8 చట్టాలు సాధించామని చెప్పారు.

jaya prakash narayana
jaya prakash narayana
author img

By

Published : Jan 2, 2020, 12:48 PM IST

రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రజలకు తాయిలాలు అందించి సరిపెడుతున్నారని తెలిపారు. ప్రజల బతుకులు మాత్రం మారట్లేదని.. మార్చేందుకు నేతలు చొరవ చూపట్లేదని పేర్కొన్నారు. ఆచరణలో భారత ప్రజాస్వామ్యం- రాజకీయాల్లో డబ్బు ప్రభావం అనే అంశంపై హైదరాబాద్​లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనవరి 9, 10 తేదీల్లో రాజకీయాల్లో ధన ప్రభావంపై ఐఎస్‌బీలో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తామని జేపీ తెలిపారు. సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలనే అంశంపై చర్చిస్తామని చెప్పారు.

రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోంది: జేపీ

ఇదీ చూడండి: రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.