ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన స్వామిగౌడ్... శాసనమండలి ఛైర్మన్‌గా హూందాగా వ్యవహరించారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. స్వామిగౌడ్‌ను లక్ష్మణ్, కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి సాధరంగా భాజపాలోకి ఆహ్వానించారు. ఉద్యమకారులను విస్మరించిన కేసీఆర్... కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు సమర్థులను బయటకు పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆణిముత్యం లాంటి పీవీ నర్సింహారావు సమాధి కూల్చుతామంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే అక్బరుద్దీన్ ఓవైసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది నిజాం రాజ్యం కాదు..
రాష్ట్రంలో కొన్ని శక్తులు మత కల్లోలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని కేసీఆర్ లేఖ విడుదల చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ ఇదే ప్రయత్నం చేసిన తెరాస... ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకుంటుందన్నారు. తండ్రి తర్వాత కొడుకు ఆ తర్వాత మనమడు పాలించడానికి ఇది నిజాం రాజ్యం కాదని హితవు పలికారు. ప్రధానికి పీవీ, సీఎంగా ఎన్టీఆర్ బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేశారని... వారి సమాధులు కూల్చుతామనడం మజ్లిస్ తల పొగరుకు అద్దం పడుతోందని మండిపడ్డారు. భాజపాపై తండ్రీ కొడుకు వాస్తవ విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడ మత కల్లోలాలు జరిగినా కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. నగర ప్రజల కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటుందని స్పష్టం చేశారు.
వాజపేయికి డ్రైవర్‌గా చేశా..
ఏ ఆత్మగౌరవం సోసం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామో... ఆ తెలంగాణలో ఉద్యమకారులను కేసీఆర్ పక్కనబెట్టారని మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరూ కీలక పాత్ర పోషించారో అందరికీ తెలుసునని... ద్రోహులకు అగ్రతాంబూలం ఇచ్చి ఉద్యమకారులను అవమానించారని ఆరోపించారు. హిందువు అంటే ఒక మతం కాదు ఒక సంస్కృతి అని వ్యాఖ్యానించారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అవకాశం ఇచ్చిన తర్వాతనే... వాజపేయికి డ్రైవర్‌గా పనిచేసిన తనకివ్వాలన్నారు.
ఇదీ చూడండి: ఎల్ఆర్ఎస్ రద్దు, పాతబస్తీకి స్పెషల్ ప్యాకేజీ.. మేనిఫెస్టోలో భాజపా వరాలు