వాణిజ్య పన్నులశాఖలో ఆశించినంతగా వసూళ్లు లేని కారణంగా ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20శాతం అధికంగా వసూళ్లు అవుతాయని వేసిన అంచనా తలకిందులైంది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 13వేల 700 కోట్లు రాగా... 2019-20 జులై వరకు 14వేల 595కోట్లు వసూలయ్యాయి. దీనికి తోడు జాతీయ వృద్ధిరేటు 9శాతం, తెలంగాణ వృద్ధిరేటు 8.7శాతం మాత్రమే నమోదైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పన్ను ఎగవేతదారుల నుంచి వసూళ్లు పెంచేందుకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అనారోగ్య కారణాలుంటే తప్ప సెలవులు ఎవరికీ ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: సికింద్రాబాద్ కంటోన్మెంటుపై కేటీఆర్ నజర్