పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాదుల హత్యను ఖండిస్తూ ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఏపీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. న్యాయవాదులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు సామాన్యులకు ఎలా కల్పిస్తాయని ఏపీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగత శివ ప్రశ్నించారు. దంపతుల హత్యను ఖండిస్తున్నామని మహిళా న్యాయవాదులు అన్నారు.
కర్నూలులో ర్యాలీ..
కర్నూలులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాద దంపతుల హత్యను వ్యతిరేకిస్తూ చేపట్టిన రెండురోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా... ఇవాళ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి : జడ్పీ ఛైర్మన్ పుట్టమధుపై అనుమానం : కిషన్ రావు