హైదరాబాద్ నగరంలోని పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.426 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, మరో వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.350 కోట్లతో ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి, రెండో దశలో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు 3 లేన్ల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. రూ.76 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణానికి కిషన్‌రెడ్డి భూమిపూజ చేశారు.
రూ.426 కోట్లతో హైదరాబాద్‌లో వంతెనలు.. మంత్రుల భూమిపూజ - నేడు కేటీఆర్ శంకుస్థాపన
జంటనగరాల పరిధిలో రూ.426 కోట్లతో నిర్మించ తలపెట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు.