ETV Bharat / city

KGF Movie Team: తెలుగు ప్రేక్షకుల ప్రేమకు సలాం చెప్పిన రాఖీభాయ్​.. - విశాఖలో కేజీఎఫ్ చిత్రబృందం

KGF Movie Team: హీరో యష్ నటించిన కేజీఎఫ్‌-2 చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. చిత్ర ప్రమోషన్​లో భాగంగా ఆ సినిమా బృందం ఏపీలో విశాఖలోని ఓ హోటల్​లో సందడి చేసింది. అత్యంత ఆదరణ చూపించిన తెలుగు ప్రేక్షకులకు హీరో యశ్ కృతజ్ఞతలు తెలిపారు.

kgf-movie-team-in-visakhapatnam-for-movie-promotion

author img

By

Published : Apr 11, 2022, 8:47 PM IST

తెలుగు ప్రేక్షకుల ప్రేమకు సలాం చెప్పిన రాఖీభాయ్​..

KGF Movie Team: కేజీఎఫ్ చిత్ర బృందం ఏపీలోని విశాఖలో సందడి చేసింది. కేజీఎఫ్ పార్ట్-2 చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖ వచ్చిన బృందం నగరంలోని ఓ హోటల్​లో మీడియాతో ముచ్చటించారు. కేజీఎఫ్ పార్ట్ -1 చిత్రం పట్ల అత్యంత ఆదరణ చూపించిన తెలుగు ప్రేక్షకులకు హీరో యశ్ కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం ఘనవిజయం సాధించడానికి సినిమా బృందం ఎంతో కష్టపడిందని ఆయన అన్నారు.

"దర్శకులు చెప్పిన కథలు నచ్చితే, ఆ క్యారెక్టర్​కు నేను సరిపోతానని భావిస్తే తప్పకుండా మరిన్ని చిత్రాలు చేస్తాను. విశాఖ నగరం చాలా బాగుంది. మొదటిసారి సాగరతీరాన్ని సందర్శించాను. భవిష్యత్తులో నా షూటింగులు ఇక్కడ చేసేలా ప్రయత్నిస్తా" - యశ్, కేజీఎఫ్ హీరో

యశ్​ నటించిన కేజీఎఫ్‌-2 ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై సినీ అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటికే థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమైయాయి.

తిరుమల శ్రీవారి దర్శనం: తిరుమల శ్రీవారిని కేజీఎఫ్ చిత్ర కథానాయకుడు యశ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కేజీఎఫ్-2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన యశ్.. స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.