ETV Bharat / city

నేడు మేడారానికి గవర్నర్లు, ముఖ్యమంత్రి - cm kcr went to medaram today

వనం వీడి జనం మధ్యకు వచ్చిన సమ్మక్కకు భక్తులు సాగిలపడ్డారు. తండోపతండాలుగా వచ్చి తల్లులకు దండాలు పెట్టారు. వనదేవతలంతా గద్దెలపైనే కొలువుండటం... భక్తల ఆనందానికి అవధుల్లేకుండా చేసింది. మమ్ములను కరుణించండంటూ... ప్రణమిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ గవర్నర్, ముఖ్యమంత్రి మేడారం రాకతో... కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

నేడు మేడారానికి గవర్నర్లు, ముఖ్యమంత్రి
నేడు మేడారానికి గవర్నర్లు, ముఖ్యమంత్రి
author img

By

Published : Feb 7, 2020, 6:54 AM IST

Updated : Feb 7, 2020, 4:32 PM IST

మేడారం మహాజాతరలో రెండో రోజు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మిమ్ములను చల్లగా చూస్తానని అభయమిస్తూ... సమ్మక్క తల్లి... చిరునవ్వులు చిందిస్తూ... గద్దెపైన కొలువుదీరింది. ఒకేసారి... నలుగురు వనదేవతలు గద్దెపైనే ఉడటంతో... భక్తుల కోలాహలం మిన్నంటింది. తల్లులారా మీకే వందనమంటూ... తనివితీరా దర్శించుకుని... మొక్కులు చెల్లించుకున్నారు.

అంతకు ముందు... చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క ఆగమనం ఆద్యంతం... వైభవంగా సాగింది. కొమ్ము, నృత్యాలు, డప్పు శబ్ధాలు... డోలు వాద్యాల మధ్య సమ్మక్కను ఆదివాసీ పూజారులు గుట్ట దిగువకు తీసుకొచ్చారు. దారి పొడవునా....భక్తులు తండపోతండాలుగా చేరి... తల్లికి నీరాజనాలు పలికారు. అందమైన రంగవల్లులద్ది... అమ్మకు ఆహ్వానం పలికారు.

తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ మేడారానికి విచ్చేసి తల్లులను దర్శించుకోనున్నారు. ప్రముఖల పర్యటనతో మేడారం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి దేవతల వన ప్రవేశంతో మహజాతర ముగుస్తుంది.

నేడు మేడారానికి గవర్నర్లు, ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: మానవ మృగానికి మరణ దండన

Last Updated : Feb 7, 2020, 4:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.