కరోనా విజృంభిస్తున్న సమయంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖలోని కేఏ పాల్ కన్వెన్షన్ భవనంలో నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని కేఏ.పాల్ హెచ్చరించారు.
'పరీక్షలపై నేను వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. హైకోర్టులో రేపే వాదనలు జరుగుతాయని ఆశిస్తున్నా. 35 లక్షలమంది విద్యార్థి లోకానికి మేలు జరిగేవరకు నా దీక్ష కొనసాగుతోంది . పరీక్షలు 2 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నా.' - ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్
ఇదీ చదవండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?: హైకోర్టు