KA Paul Comments: తెలంగాణలో తెరాస గుండాల రాజ్యం నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు వారిపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ సాహసించలేదని.. కానీ ఇప్పుడు కేఏ పాల్ వచ్చాడని.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని తన నివాసంలో తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లలో తన మీద జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్దామనుకుంటే రెండు రోజులుగా పోలీసులు తనను గృహ నిర్భందం చేశారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుందని.. ప్రజలకు కావాల్సిన అన్ని అభివృద్ది పనులు తన వల్లనే సాధ్యమవుతాయని కేఏ పాల్ జోస్యం చెప్పారు. తెరాస కావాలా...? ప్రజాశాంతి పార్టీ అభివృద్ది కావాలా..? తేల్చుకుని ఓటు వేయాలని ప్రజలను పాల్ కోరారు.
"ఖబడ్దార్ కేటీఆర్.. నువ్వు ఎవరితో ఫైట్ చేస్తున్నావో అర్థమవుతోందా..? ఎంతో మంది దేశ అధ్యక్షులు మోకరిల్లిన నా మీద నువ్వు దాడి చేయించావు. డీజీపీని కలుద్దామంటే.. కలవనివ్వట్లేదు. నన్ను రెండు రోజులుగా గృహనిర్భందం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశాను. ఇక డీజీపీని కలవను. ఇప్పుడే ఇంతగా గుండా రాజ్యం ఉందంటే.. ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇంకేంత అరాచకం రాజ్యమేలుతుందో చూడండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా.. తండ్రీ కొడుకులిద్దరూ చిత్తుచిత్తుగా ఓడిపోవటం ఖాయం. అభివృద్ధి కావాలంటే కేఏ పాల్.. అరాచక పాలన కావాలంటే కేటీఆర్.. ఇక ప్రజలే ఆలోచించుకోవాలి." - కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: